33-2022(21-08-2022)Proddatur Farm Advisory

33-2022(21-08-2022)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన వర్షము – 2mm కురిసే అవకాశం వుంది . గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 27 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తాళ్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులకు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
ఇలా గతవారం చెపుకున్నాము, రైతులు ఒక సారి గమానించగలరు,
అలాగే పత్తి పంట వేసుకున్న రైతులు ముక్యంగా గమనించవలసిన విషయాలు,
1.మొదట నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి,
2.దేశీ వాలి విత్తనాలను సాగుచేయాలి,
3.పత్తి పంట లో అధికంగా గులాబీ రంగు పురుగు వృధితి ఎక్కువ గ ఉంటుంది
ఈ పురుగు అదుపు కు ఎమి చేయాలి.
విత్తనం పొలంలో నాటే ముందు విత్తన శుద్ది చేయాలి, ఇలా చేయడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగులు రాకుండా చేసుకోవచ్చు
*పత్తిలో అలసంద, పెసలు, సోయాబీన్స్ అంతర పంట గా వేయడం వల్ల రైతు మిత్ర పురుగులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సస్యరక్షణ జరుగుతుంది, ఈ అంతర పంటలు వల్ల ఆదాయం కూడా వస్తుంది,
*యరపంట ఆముదం ,బెండ పత్తి పంట లో నాటుకొని దానిపై ఆశించిన లార్వాలు ను ,పురుగు గుడ్లను నాశనము చేయలి,
*పత్తి పంట చుట్టూ రక్షిత పంట గా 4 వరసలు జొన్న,సజ్జ విత్తాలి.
*పురుగుల మందులు పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో మిత్ర పురుషులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది.
*పొలంలో ఎకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
*తల్లి పురుగుల గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయం పిచికారీ చెయ్యాలి 5 రోజుల వ్యవధి తో 2 సార్లు స్ప్రే చేయాలి,
మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం

About the author

Bhairava Kumar M administrator

Leave a Reply