Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 18-33mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంటగ వరి లేధా ఇతర పంటలకొరకు విత్తనం సిద్దం చేసుకోవాలనుకునే రైతులు మేలైన విత్తనం అవునో కాదో తెలుసుకొనుటకు విత్తనపరీక్ష చేసుకోవలెను. రైతులు యెంచుకున్న విత్తనాన్ని మొలకశతం తెలుసుకున్న తర్వాతనే నారు పోసుకోవాలి లేనిచో విత్తనంలో లోపం ఉన్నా, మొలక శాతం తక్కువగా ఉన్న నారుమడిలో వేసిన విత్తనం వృధా అవుతోంది. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధ0గా నారు మడి నేలను సారవంతం చేయాలి. మరీ ఎక్కువ లోతుగా నేలను దున్నకపోవటం మంచిది. విత్తనం విత్తుకునేముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. . మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.