సుస్థిర వ్యవసాయ కేంద్రం-
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-14mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-8km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. PKR పురం, Sksr పురం, పాతూరు, జగ్గయ్యపేట, సోంపురం గ్రామాల్లో వరిలో ఆకు ఎండు తెగులు ఉదృతి ఉన్న0దువలన రైతులు నత్రజని ఎరువులు వాడుక తగ్గించి పశువుల పెడ ద్రావనం పిచికారి చేసుకోవలెను .అలాగే PKR పురం,సారవాణిపాలెం,కోటయ్యగరువు గ్రామాల్లో బెండ మరియు వంగలో మొవ్వు,కాయ తోలుచు పురుగుల నివారణకు ఎకరానికీ 5-6లింగకార్షక బుట్టలను ఏర్పరిచి 5% వేప కషాయం పిచికారి చేయవలెను. అలాగే మెట్టు ప్రాంతాలు అయిన మారిక, చామలపల్లి, వెంకయ్యపాలెం, పోతుబంధీ పాలెం, కెజి పూడి గ్రామాల్లో జీడి మామిడి తోటలలో అంతర పంటలుగా అపరాలు,ఉలవలు మొ// పంటలు వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన సుద్ది చేసుకొని విత్తుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.