Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 4-18milli mitre మోతదులో వేరువేరు చోట్ల వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో వీయవచ్చు. కె.జి.పూడి, SKSRపురం క్లస్టర్లులో ఉన్న రైతులు ప్రధాన పంటకు సిద్దం చేసుకుంటున్న బూమిలో 30-40 రోజుల ముందు నవధాన్య సాగును చేసుకోవలెను. మరియు భూసార పెరుగుదలకు, భూమిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించడం కోరకు సహజ సిద్దంగా తయరుచేసిన ఎరువులలో ఘనజీవామృతం అత్యంత కీలక పాత్ర పోసిస్తుంది. దీనిని తయారుచేసుకోవటం కోరకు ఎకరానికి 100 కిలోల ఆవు పేడను నేలపై పరిచి 2 కిలోలు పప్పుదినుసుల పిండిని, 2 కిలోలు బెల్లాన్ని, 1kg పుట్టమన్నును ఒకదాని తర్వాత ఒకటిగా చల్లి 5lt ఆవు మూత్రంను చల్లుతూ పార సాయంతో అన్నీ కలిసేటట్లు చేసి ఉండలుగా చుట్టి వాతవరణ పరిస్తితుల బట్టి 6-8రోజులు నీడలో ఆరబెట్టాలి. ఇలా తయారుచేసుకున్న ఘనజీవామృతంను దుక్కులలో వేసి ఎరువుగా ఉపయోగించవలెను .
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.