Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-13km వేగంతో దక్షిణం నుండి నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో వరి వేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతిలో నారు మడిని తయారు చేసుకునేందుకు ఎకరానికి 5సెం. నారుమడిని సిద్దం చేసుకోవాలి. మెట్టు భూమిలో సాగుచేస్తున్నవారు దుక్కు చేసుకునేటపుడు దుక్కులో 10కేజీల ఘనజీవామృతం, 10కేజీల మాగిన పశువులపెడ, 10కేజీల వేపపిండి వేసుకొని దున్నుకున్న తర్వత బీజామృతం తో విత్తన శుద్ది చేసుకొని విత్తుకోవలెను. అలాగే దంప పద్ధతిలో నారుమడి తయారుచేస్తున్న రైతులు దమ్ములో 10కేజీలు ఘనజీవామృతం,10కేజీలు పశువుల పెడ, 10కేజీలు వేప పిండి వేసుకొని బీజామృతంతో విత్తనశుద్ది చేసుకొని మండె కట్టుకొని విత్తనాలను జల్లుకోవాలి. విత్తనాలు విత్తుకున్న 15రోజులకు నీమాస్త్రం, ద్రవజీవామృతం పారించుకుని 4ఆకుల తర్వాత నాటుకుంటే ఎక్కువ పిలకలు వస్తాయి. శ్రీ వరి పద్దతిలో 10-12రోజుల నారును ప్రధానపొలంలో నాటుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.