Category Archive Farm Advisories

33-1(17-8-2022) Vepada Farm Advisory

Date: 17-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-24mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-12km వేగంతో పశ్చిమ దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు ప్రతి 2mt కు ఒక అడుగు వెడల్పులో కాలిబాటలు తూర్పు, పడమర దిశలుగా ఏర్పరుచుకోవలెను .రైతులు కాలిబాటలు తీయటం వలన వరి చేలో గాలి బాగా పోసుకోవడానికి,పురుగులు, తెగుల్లు ఉదృతి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.గట్ల వెంట,దారుల వెంట మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.మరియు ఇతర అంతర క్రుషి పనుల పరిశీలనకు కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి.మరియు మొక్క ఎధుగుధలకు 15-20రోజుల కాల వ్యవధీలో ద్రవజీవామృతం పారించుకోవలెను. మరియు PKR puram, sksr puram, saravanipalem,chamalapalli గ్రామలలో కురగాయలు వేసుకున్న రైతులు రసం పిల్చు మరియు కాయ తోలుచు పురుగుల నివారణకు నీమాస్త్రం / పంచపత్ర కషాయం పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

32-2022(14-08-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 2mm. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 26 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
1.భూసార యాజమాన్య పద్ధతులు
2.సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
భూసార యాజమాన్య పద్ధతులు:
వివిధ రకాల విత్తనాలతో పచ్చి రొట్టె ఎరువులు పెంచి 40 రోజుల వయసులో భూమి లో దున్నాలి,మొక్కలకు పోషక పదార్థాలు అందించే సూక్ష్మ క్రిములు బాగా పెరిగి భూమిలో జీవపదారం అభివృద్ధి చెందుతుంది, సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల అవుతాయి.
ఈ విషయాలు రైతులు గమనించాలి.
*సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది*
ఎపుడు; నారు నాటే ముందు
ఎందుకు: నారు ద్వారా ఆశించే తెగుళ్లు ను నివారించడానికి
*పసుపు, తెలుపు ప్లేట్స్
ఎపుడు; నారు నాట్లు వేసిన తర్వాత ,ప్లేట్స్ మొక్కలకు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
ఎందుకు: చిన్న చిన్న రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ని తెలుసుకోవచ్చు, వాటిని నివారించవచ్చు.
ఎకరానికి 20నుండి 25 ప్లేట్స్ పెట్టాలి.
*రక్షకపంటలు
ఎపుడు:వరిలో నాట్లు వేసిన తర్వాత బంతి నారు నాట్లు వేయాలి.
ఎందుకు:పురుగుల, తెగుళ్లు వ్యాప్తి ని నివారించడానికి, మిత్ర పురుగుల అభివృద్ధి కి
*లింకాకర్షక బుట్టలు
వరిలో నాట్లు వేసిన తర్వాత 10నుంచి 15 పెట్టాలి, వరిలో కాండం తొలిచే పురుగు నివారించడానికి
కోసలు తుంచి నాటడం :
వరి నాట్లు వేయడానికి ముందు ,కాండంతొలిచే పురుగు గుడ్ల సముదాయం నివారించడానికి, నాటే ముందు కోసలు తుంచి నాటాని
*కాలిబాటలు
వరి నాట్లు వేసే సమయంలో దోమ పొట్టు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రించేందుకు వరిలో ప్రతి 2 metres లకు 30 cm కాలి బాటలు వదలాలి.
వరిలో అజోళ్ళ
పంటకు నత్రజని అందించడానికి, కలుపు నివారణకు ఉపయోగపడతాయి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

32-2(13-8-2022) Vepada Farm Advisory

Date: 13-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 5-55mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-16km వేగంతో పడమర నుండి నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు రసం పిల్చు పురుగు నుండి పంటను రక్షించుకొనుటకు రైతులు నీమాస్త్రం గాని పంచపత్ర కషాయం గాని పిచికారి చేసుకోగలరు. మరియు పొలంలో ఎకరానికి 15-20 పక్షి స్థావరాలు, పసుపు, నీలం జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోగలరు.అలాగే 2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబందించిన crop booking నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది కావున రైతులందరు ఈ విషయాన్ని గమనించి సంబందిత రైతు భరోసా కేంద్రంకు వెళ్లి మీ పంటను నమోదు చేసుకోగలరని మనవి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

32-2022(12-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 65%, అలాగే గంటకి 26 కి.మి. వేగంతో దక్షిణ దిశా గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. అలానే ఈ పత్తి ఆకులు అధికముగా వీచు గాలుల వలన గాని, చల్లటి వాతావరణం వలన గాని ఈ ఆకులు ఎర్రగా అవును. అలాగే ఇప్పుడు కొంతమంది వర్షధారంగా వేసుకొనే పత్తి రైతులు మంచి విత్తన రకాన్ని ఎన్నుకొని బీజామృతం తో గాని లేదా టి విరిడి తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి.కాబట్టి భవిష్యత్తు లో మన పంట కి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా పంట చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.
అలాగే పసుపు జిగురు పల్లాలు, కషాయాలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం.. మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

32-1(10-8-2022) Vepada Farm Advisory

Date: 10-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 4-40mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-16km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు పొలంలో విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిలవ ఉండక బురదగా మాత్రమే ఉంచాలి. ఎక్కువైన నీరు బయటకు పోవడానికి కాలవలు ఏర్పాటు చెయ్యాలి. దీనివలన వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు అభివృద్ధి చెందుతాయి. మరియు సారవానిపాలెం, దుంగాడ, కోటయ్యగరువు ప్రాంతాలలో వేరుశనగ వేసిన రైతులు వర్షాలకు తెగులు ఆశించకుండా ఉండటానికి రైతులు పెడ+ముత్రం+ఇంగువ ద్రావణంను పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

31-2(6-8-2022) Vepada Farm Advisory

Date: 6-8-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-90mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 28-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 3-7km వేగంతో దక్షిణం నుండీ పడమర దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు ప్రధాన పొలం గట్లపై సరిహద్దు పంటలుగా కంది,జొన్న,మొక్కజొన్న,సజ్జ,కురగాయలను,తీగ జాతి మొక్కలను వేసుకోవలెను. అలాగే ఎర పంటలుగా బంతి,చామంతి, ఆముదం మొ|| వాటినీ వేసుకోవాలి. ఇలా గట్లపై మొక్కలను పెంచడం వలన ప్రధాన పంటకు బయట పొలాల నుండి శత్రు పురుగులు ఆశించకుండా ఉంటాయి అలాగే మిత్ర పురుగులు అభివృద్ధి చెంది శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. మరియు వరిలో తెగులు ఆశించకుండా రైతులు పెడ+ముత్రం+ఇంగువ ద్రావణంను పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

31-2022(05-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 31 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 50%, అలాగే గంటకి 26 కి.మి. వేగంతో దక్షిణ దిశా గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. అలానే ఈ పత్తి ఆకులు అధికముగా వీచు గాలుల వలన గాని, చల్లటి వాతావరణం వలన గాని ఈ ఆకులు ఎర్రగా అవును. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది వర్షధారంగా వేసుకొనే పత్తి రైతులు మంచి విత్తన రకాన్ని ఎన్నుకొని బీజామృతం తో గాని లేదా టి విరిడి తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి.కాబట్టి భవిష్యత్తు లో మన పంట కి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా పంట చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.
అలాగే పసుపు జిగురు పల్లాలు, కషాయాలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం.. మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

31-1(3-8-2022) Vepada Farm Advisory

Date: 3-8-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-47mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-9km వేగంతో ద్దక్షిణం నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి నాట్లు వేస్తున్న రైతులు వరుసలలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 20-25 సెం.మీ వరకు తీసుకొని నాటుకున్నట్లైతే పిలకలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడిని పొందవచ్చు. మరియు ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ దూరములో కాలిబాటలు తీసుకోవలెను. వీటివలన పైరుకు గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉదృతిని అధుపు చెయ్యవచ్చు. మరియు పికెఆర్ పురం, ధబ్బిరాజుపేట, కోటయ్యగరువు, సారవానిపాలెం గ్రామాల్లో కూరగాయలు వేసుకున్న రైతులు రసం పీల్చే మరియు కొరుకుతినే పురుగులను నివరించడానికి నీమాస్త్రం గాని పంచపత్ర కషాయం గాని స్ప్రే చేయగలరు చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

30-2(30-7-2022) Vepada farm Advisory

Date: 30-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 12-29mm మొతాదులో తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో దక్షిణం నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రధాన పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు కొనలను తుంచి నాటవలెను ఇలా చేయడము వలన కాండం తొలుచు పురుగు గుడ్లను నాశనం చేయవచ్చును. మరియు ఉద్యానవన పంటలు అయిన జీడి, మామిడి మరియు ఇతర తోటలలో అడ్డదిడ్డముగా ఎదిగిన కొమ్మలను తీసివేయుట వలన సూర్యరష్మీ చెట్టంతా సోకి మంచి కాపునిస్తుంది అలాగే కొత్త చిగురు రావడానికి ద్రవజీవామృతం పారించవలెను. మరియు నేలలో పదును చూసుకొని వరుసల మద్య దున్నటం వలన కలుపు నివారణ జరిగి, భూమిలో కీటకాల గుడ్లు,నిధ్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి ఎండవేడికి నశిస్థాయి.మరియు వర్షపు నీరు బాగా ఇంకుతుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

30-2022(30-07-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 19 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 40 %, అలాగే గంటకి 10 కి.మి. వేగంతో దక్షిణ దిశా గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీని వలన పెరుగుదల తగ్గి ఆకులపై హోపర్ బర్న్ లక్షణం కనిపిస్తుంది. దీనిని నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పంటలో 2 లేదా 3 కాయలను కోసి గమనిస్తూ ఉండాలి. అలాగే పత్తి లో మెగ్నీషియం లోపం వలన ఆకులు ఎర్రగా మారిపోవడం. అలానే ఈ పత్తి ఆకులు అధికముగా వీచు గాలుల వలన గాని, చల్లటి వాతావరణం వలన గాని ఈ ఆకులు ఎర్రగా అవును. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది వర్షధారంగా వేసుకొనే పత్తి రైతులు మంచి విత్తన రకాన్ని ఎన్నుకొని బీజామృతం తో గాని లేదా టి విరిడి తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి.కాబట్టి భవిష్యత్తు లో మన పంట కి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా పంట చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.
అలాగే పసుపు జిగురు పల్లాలు, కషాయాలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం.. మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు CSA కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.