Date: 12/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం మేఘవృతమై ఉండి 0-6mm మోతదులో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో తూర్పు దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 60-67% ఉండవచ్చును.
👉 జగ్గయ్యపేట, గుడివాడ, కరకవలస గ్రామాల్లో ప్రధాన పంట అయిన వరిలో సుడి ధోమ లేధా ధోమపోటు ఉదృతి ఎక్కువగా వున్నది కావున రైతులందరు ఎకరానికీ 15కిలోల ఇసుకకు 1.5 lt వేప నూనెను బాగా పట్టించి రాత్రoత ఉంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉదృతి తగ్గుతుంది లేధా తూటికాడ కషాయం పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్లలో వరి వేసుకున్న రైతులు మాణిపండు తెగులు రాకుండా సీతాఫల కషాయం తయారుచేసి ముందుగానే పిచికారి చేసుకున్నట్లైతే తెగులును నివారించవచ్చును.
👉అలాగే రబీ డ్రై సోయింగ్ పద్దతిలో మినుములు ,పెసలుతో పాటు బొబ్బర్లు,ఉలవలు,రాగులు,జొన్న ,మొక్క జొన్న విత్తనాలను ఎకరానికీ 10-12కిలోల మోతదులో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను. థేమ శాతం తక్కువుగా ఉన్న ప్రాంతాలలో ఈ పద్దతిలో వేసినట్లైతే భూసారం పెరగడమే కాకుండా రైతులకు అధిక ఆదాయం కలుగుతుంది.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.