Date:01/04/2023
Centre for Sustainable Agriculture
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 0-8mm మొతాధులో వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 12km వేగంతో తూర్పు నుండి ఆగ్నేయం దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-70% ఉండవచ్చును.
👉🏻సారవానిపాలెం, సొంటివానిపాలెం, దబ్బిరాజుపేట, వెంకయ్యపాలెం గ్రామలలో ప్రస్తుత వాతవరణ పరిస్తుతులు వలన వేరుశనగలో ఆకు మచ్చ తెగులు మరియు వేరు కుళ్లు తెగులు వచ్చే అవకాశం వున్నందువలన పుల్లటి మజ్జిగ కాని సొంటిపాల కషాయం కాని వర్షాలు ఆగిపోయిన తర్వాత రైతులు పిచికారి చేయవలెను.
👉🏻SKSR పురం, PKR పురం, దబ్బిరాజుపేట, చిట్టివానిపాలెం గ్రామాల్లో రాగులు వేసిన రైతులు పేనుబంక నివారణకు జిగురు అట్లను ఏర్పరచి వేపనూనెను పిచ్కారి చేయవలెను మరియు గొంగళిపురుగులు పొలంలో కనిపించినట్లైతే కంకులను దులిపి పురుగులను ఏరి నాశనం చేసి పంచపత్ర కషాయం లేధా దశపర్ణి ని పిచికారి చేయవలెను.
👉🏻అలాగే మామిడి మరియు జీడిలో పండు ఈగ వచ్చె అవకాశం ఉంది కావున రైతులు పండు ఈగ ఉచ్చులను ఎకరానికి 6-8 అమర్చవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.
About the author