వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 23-51mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. తుఫాన్ హెచ్చరిక ఉన్న కారణంగా ఆకాశం మేఘవృతమై ఉండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది కావున కేజీ పూడి, SKSR Puram క్లస్టర్లలో ఉన్న రైతులందరూ పొలాల్లో ఎరువులు వేయుట కానీ, కషాయాలు పిచికారి చేయటం వంటి పనులు వాయిద వేసుకోవాలి.మరియు పోలాల్లో వర్షపు నీరు బయటికి పోయేలా నీటి కాలవలు తీసుకోవలెను. మరియు పండ్ల తోటలు అయిన అరటి,బొప్పాయి మో|| వాటిలో పక్వానికి వచ్చిన పళ్లను వెంటనే కోయాలి.అలాగే తుఫాన్ గాలికి పడిపోకుండ మొక్కల పక్కన వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. తధుపరి మొక్కలకు వర్షల కారణంగా తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులు అందరు పెడ,మూత్రం,ఇంగువ ద్రావణం గానీ సొంటిపాల కాషాయం కాని పిచికారి చేసుకోవలెను.అలాగే Kg pudi,Sksr puram క్లస్టర్లులో e-cropలో పంట నమొదుకు ఈ నెల25వ తేదీ వరకు గడువున్నది కనుక ఈ-క్రాప్ నమోధు చేసుకోలేని రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న RBK లను సంప్రదించగలరు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author