Date:22/04/2023
Centre for Sustainable Agriculture
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన- వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25-27డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-17km వేగంతో నైరుతి దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 20-67% ఉండవచ్చును.
👉🏻కెజి పూడి, కరకవలస క్లస్టర్లు అయిన గ్రామాల్లో ప్రస్తుతం నువ్వులు వేసుకున్న రైతులు మొక్క పెరుగుదలకు ద్రవజీవామృతం పిచికారి చేయవలెను. మరియు రసం పీల్చు పురుగుల వల్ల ఆకుముడత వచ్చె అవకాశం ఉన్నాందున రైతులు ఆవు పేడ+మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేసుకోవలెను
👉🏻SKSR పురం, బొద్ధం గ్రామాల్లో రాగులులో కత్తెర పురుగు మొదటి దశలలో ఆకులపై పత్ర హరితాన్ని గోకి తింటూ పంటకు నష్టం కలిగిస్తున్నాయ్ కావున రైతులు లింగాకర్షక బుట్టలను ఏర్పరిచి వేప నూనె పిచ్కారి చెయ్యవలెను.
👉🏻 మరియు భూసారం పెంపొందించటం కోరకు రైతులు జీలుగ , జనుమ కోసం సంబందిత రైతు భరోసా కేంద్రాలులో పేరు నమోదు చేసుకోవలెను. వాటితో పాటూ నవధాన్యాలు కూడా కలుపుకొని తొలకరి వర్షాలు పడినపుడు విత్తుకోవలెను.
👉అలాగే అధిక ఉష్ణోగ్రత కారణంగా పశువులకు వడదెబ్బ తగలకుండా , మంచి నీరును అందుబాటులో ఉంచవలేను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.