Date:28/1/2023
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 15-17డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4km వేగంతో తూర్పు నుండి దక్షిణ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 54-68% ఉండవచ్చును.
👉 K.G పూడి,Sksr పురం క్లస్టర్లలో మినుములు మరియు పెసలు వేసుకున్న రైతులు పొలంలో పేనుబంక ఉదృతి ఉన్నందున పసుపు రంగు జిగురు అట్టలను 15-20 చొప్పున ఎకరానికి ఏర్పరచి నీమాస్త్రం లేధా వేపనూనెను పిచికారీ చెయ్యగలరు.
అలాగే ఆకు మచ్చ తెగులు నివారణకు పెడ+ మూత్రం +ఇంగువ ద్రావణం పిచికారి చెయవలెను.
👉మరియు బొద్ధం, రామస్వామి పేట, PKR పురం గ్రామాల్లో బీరలో పల్లాకు తెగులు మరియు గుమ్మడి పెంకు పురుగుల ఉదృతి ఎక్కువగా వున్నందువలన రైతులు పల్లాకు తెగులు నివారణకు పుల్లటి మజ్జిగ లేదా సొంటిపాల కషాయం పిచ్కారి చేయవలెను. అలాగే పెంకు పురుగుల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలును 15-20 వరకు ఎకరానికి ఏర్పరిచి పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉🏻కేజీ పూడి,చిట్టివాని పాలెం,కోటయ్యగరువు,పోతుబంధీ పాలెం,వెంకయ్యపాలెం గ్రామాల్లో మామిడి తోటలలో పూత నిలబడి మరియు పిందె బాగా వచ్చుటకు పుల్లటి మజ్జిగను పూత బాగా విచ్చుకోకముందే పిచికారి చేయవలెను. పూత బాగా ఉన్నపుడు పిచికారి చేయడము పుప్పొడి రాలి పరగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.