Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 22-29mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-14km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు వరి సాగు చేసుకునే పద్దతి బట్టి విత్తనమోతధు ఎకరానికి మారుతూ ఉంటుంది. శ్రీ వరి పద్దతిలో సాగు చేస్తున్నట్టయితే ఎకరానికి 2కేజీలు సరిపోతుంది. నీటి ముంపు పద్దతికి 30 కిలోలు, అలాగే డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసుకునేందుకు 8-10 కిలోలు విత్తనం అవసరం. అలాగే రైతులు విత్తనం విత్తేముంధు ఆవుముత్రంతో గాని, పశువుల పెడ మరియు మూత్రంతో గాని, వస కషాయంతో గాని, సూడోమోనస్తో విత్తనశుద్ధి చేసుకోవలెను. రైతులు విత్తనశుద్ధి చేసుకోవటం వల్ల పంటకాల0లో ఆశించే చీడపీడలను చాలావరకు నివారించవచ్చు.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.