Yearly Archive July 20, 2022

29-1(20-7-2022) Vepada Farm Advisory

Date: 20-7-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-11km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి నారును వేసుకున్న రైతులు నాారు మడులలో ద్రవజీవామృతం పారించవలెను. దీనివలన మొక్కకు కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతోంది. అలాగే నారు వ్యవస్థలో రసం పిల్చె పురుగులు ఆశించకుండా నీమాస్త్రం పిచికారి చేసుకోవలెను. మరియు ధబ్బిరాజుపేట, కోటయ్యగరువు, శరవానిపాలెం, దుంగాడ గ్రామాల్లో వేరుశెనగ వేసుకున్న రైతులు తిక్క ఆకు మచ్చ తెగులు రాకుండా పెడ+ముత్రం+ఇంగువ ద్రావణం పిచ్చికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

28-2(16-7-2022) Vepada Farm Advisory

Date: 16-7-2022
Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-24mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్ లో నారు మడులలో వరి విత్తనాలు వేస్తున్న రైతులు బీజామృతం తో విత్తన శుద్ధి చేసుకోవలెను. మరియు ప్రధాన పొలం గట్లపై సరిహద్దు పంటలుగా కంది,జొన్న,మొక్కజొన్న,సజ్జ,కురగాయలను,తీగ జాతి మొక్కలను వేసుకోవలెను. అలాగే ఎర పంటలుగా బంతి,చామంతి, ఆముదం మొ|| వాటినీ వేసుకోవాలి. ఇలా గట్లపై మొక్కలను పెంచడం వలన ప్రధాన పంటకు బయట పొలాల నుండి శత్రు పురుగులు ఆశించకుండా ఉంటాయి అలాగే మిత్ర పురుగులు అభివృద్ధి చెంది శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. మరియు రైతుకు అదనపు ఆధాయం కూడా లభిస్తుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

28-2022(16-07-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజుల్లో మబ్బులతో మేఘవృతం అయ్యి ఉండును. గాలిలో తేమ 40 %, అలాగే గంటకి 29 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె, బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది. అలాగే ఆకుముడత ఆకు మీద సర్పిలాకారంలో వలయాలుగా చేరి రసాన్ని పీల్చును. అలాగే పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పంటలో 2 లేదా 3 కాయలను కోసి గమనిస్తూ ఉండాలి. అలాగే పత్తి లో magnesium మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి. దీని చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా బంతి,ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.

28-1(13-7-2022) Vepada Farm Advisory

Date: 13-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-47mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్ లో నారు మడులలో వరి విత్తనాలు వేస్తున్న రైతులు బీజామృతం తో కానీ, ట్రైకోడెర్మాతో కానీ, సూడోమోనాస్ తో కానీ విత్తనశుద్ధి చేసుకోవలెను. విత్తనశుద్ధి చేసుకోవటం వలన విత్తనం బాగా మొలకెత్తి, విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియంత్రిస్తుంది. అలాగే PKR పురం, ఎస్‌కేఎస్‌ఆర్ పురం, సారవానిపాలెం గ్రామాల్లో కురగాయాలు వేసుకున్న రైతులు రసం పీల్చే పురుగుల ఉద్రుతి నుండి రక్షించుకోనుటకు వేపనూనె లేదు నీమాస్త్రం పిచ్చికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

27-2022(09-07-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – వర్షము 8mm కురిసే అవకాశం వుంది. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట కు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా గత వారం లో చెపుకున్న విషయాలు మళ్ళీ ఒక సారి గుర్తు కు చేసుకున్నాము,విత్తనసుద్ది, ఘనజీవమృతం, ద్రావజీవమృతం
ఇప్పుడు ఈ వారంలో రైతులు మంచి విత్తనం యంపీక చేసుకోవాలి,, నారు పెట్టడానికి , అనువైన పొలాన్ని నారు మడి కోసం యంపీక చేసుకోవాలి,
నారుమడిలో మెళకువలు తెలీసుకున్నాము:
బెంగాల్ పద్ధతి నాట్లు,
సంప్రదాయం నాట్లు, బెంగాల్ వాళ్ళు నాట్లకు 2 సెంట్స్ నారు మడ్డి అయితే సరిపోతుంది, ఎకరాకు,
అదేవిధంగా సంప్రదాయం నాట్లు అయితే 4 నుంచి 5 సెంట్స్ లో నారు మడి సరిపోతుంది ఎకరాకు,
*నారు మడి ని వారం రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి ,బాగా చివికిన పశువుల ఎరువును 200 కిలోల 5 సెంట్స్ నారు మడికి వేయాలి,
*చివరి దమ్ము లో తయారు చేసుకున్న ఘనజీవమృతం, వేసుకోవాలి, ట్రైకోడర్మ 1kg నారు మడి కి వేసుకోవాలి,
మొలక కట్టిన విత్తనాన్ని బీజామృతం తో విత్తనసుద్ది చేయాలి, సెంటు నారు మడికి 4 to 5 కిలో చొప్పున నారు మడిలో పలుచగా నీరు పెట్టి చలలి, మరుసటి రోజు మడి నుంచి నీటిని పూర్తిగా తీసివేయాలి, ఆకులు బయటకు వచ్చే వరకు ఆరుతడి పెట్టాలి,
విత్తనం చలిన 7 to8 రోజుల కు 5 సెంట్స్ నారు మాడి కి 10:1 లో ద్రావజీవమృతం పారించాలి, అంటే 100 లీటర్ కు ఒక లీటర్ చొప్పున పారించాలి, ఇలా చేవడం వల్ల నారు బాగా ఉండి ,పిలకలు ఎక్కువ వచ్చి ,దిగుబడి అధికంగా ఉంటుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

27-2( 9-7-2022) Vepada Farm Advisory

Date: 9-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-40mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-15km వేగంతో దక్షిణం నుండి పడమర దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో నారు మడులలో వరి విత్తనాలు వేసుకోవాలనుకునే రైతులు బీజామృతం తో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవలెను. బీజమృతం తయారు చేసుకొనుటకు 20lt నీరు, 5kg ఆవు పేడ, 5lt ఆవు మూత్రం,50gm సున్నం, పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. 20lt నీటిలో పెడను గుడ్డలో మూటకట్టి vrelada deeyavalenu. ఇందులో ఆవు మూత్రం ,సున్నం కలుపుకొని 12hrs అలాగే ఉంచు రోజుకి రెండు సార్లు కర్ర సహాయంతో కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బీజామృతమును విత్తడానికి సిద్ధముగా ఉన్న విత్తనలపై చల్లి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవలెను. దీనివలన విత్తనం బాగా మొలకెత్తి, విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియ0త్రిస్తుంది.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

27-2022(09-07-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 19 mm వర్ష పా తం రాగల దని సూచన , అలాగే గంటకి 31 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలి వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె ,బక్కనగారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పంట పూత దశకు రాక మునుపే పెట్టుకోవడం వలన పురుగును నివారించవచ్చు. పత్తి లో మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.

26-2(2-7-2022) Vepada Farm Advisory

Date: 2-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-13km వేగంతో దక్షిణం నుండి నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో వరి వేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతిలో నారు మడిని తయారు చేసుకునేందుకు ఎకరానికి 5సెం. నారుమడిని సిద్దం చేసుకోవాలి. మెట్టు భూమిలో సాగుచేస్తున్నవారు దుక్కు చేసుకునేటపుడు దుక్కులో 10కేజీల ఘనజీవామృతం, 10కేజీల మాగిన పశువులపెడ, 10కేజీల వేపపిండి వేసుకొని దున్నుకున్న తర్వత బీజామృతం తో విత్తన శుద్ది చేసుకొని విత్తుకోవలెను. అలాగే దంప పద్ధతిలో నారుమడి తయారుచేస్తున్న రైతులు దమ్ములో 10కేజీలు ఘనజీవామృతం,10కేజీలు పశువుల పెడ, 10కేజీలు వేప పిండి వేసుకొని బీజామృతంతో విత్తనశుద్ది చేసుకొని మండె కట్టుకొని విత్తనాలను జల్లుకోవాలి. విత్తనాలు విత్తుకున్న 15రోజులకు నీమాస్త్రం, ద్రవజీవామృతం పారించుకుని 4ఆకుల తర్వాత నాటుకుంటే ఎక్కువ పిలకలు వస్తాయి. శ్రీ వరి పద్దతిలో 10-12రోజుల నారును ప్రధానపొలంలో నాటుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

26-2022(01-07-22) Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 10 mm వర్ష పా తం రాగల దని సూచన , అలాగే గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలి వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పాలపల్లి ,టీవీ పల్లె ,బక్కనగారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే పత్తి మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం ,వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు దుక్కిలో200 నుండి 400కేజీల ఘనజీవమృతం తయారు చేసుకొని వేసుకోవాలి.ఘన జీవామృతం వేసుకోవడం వలన భూమిలో సూక్ష్మ జీవుల అభివృధి చెందుతాయి.మరియు విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. వేంపల్లి,జిగురు పల్లాలు, కాషాయ లు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.

26-1(29-6-2022) Vepada Farm Advisory

Date: 29-6-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 21-63mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు కూరగాయలు సాగుచేయాలనుకునే రైతులు బీజామృతం తో నాారుశుద్ధి చేసుకొని నాటుకోవలెను. నాారుశుద్ధి చేసుకోనుటకు 2lt ఆవు మూత్రం,1కిలో పశువులపెడ, 1కిలో పుట్టమన్ను కలిపి ద్రావణం తయారు చేసుకుని నాట్లు వేసేముందు నారును అరగంట పాటు ఆ ద్రావణంలో ఉంచిన తర్వాత నాటవలెను. రైతులు విత్తనశుద్ధి చేసుకోవటం వల్ల పంటకాల0లో ఆశించే చీడపీడలను చాలావరకు నివారించవచ్చు.అలాగే వేరుసెనగ వేసుకోవాలనుకునే రైతులు బీజరక్ష తో విత్తనశుద్ధి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.