Date: 26/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-33డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16-17డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8km వేగంతో పడమర నుండీ తూర్పు దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 48-50% ఉండవచ్చును.
👉 K.G పూడి,Sksr పురం క్లస్టర్లులో ప్రధాన పంట అయిన వరి 80%వరకు కోతకు సిద్దంగా ఉన్నది కావున రైతులు కొత్త కోసె వారం రోజులు ముందు పొలాల్లో ఉన్న నీరుని తీసి నేలను ఆరబెట్టినట్లు ఉంచవలెను. అలాగే 80%గడ్డి రంగు పసుపు రంగులోకి మారి తేమ శాతం 20కి మించకుండా కోయవలెను.ధాన్యపు గింజలు గట్టిపడకముందు కోసినట్లైతే వర్షాలకు మొలకెత్తడం లేదంటే కుళ్లిపోవడమ్ జరిగి నాన్యత మరియు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే గింజ బాగా గట్టిపడిన తర్వాత కోసినట్లైతే మొలక శాతం తగ్గి నూర్పు సమయంలో గింజ విరిగిపోయే అవకాశం ఉంది కావున రైతులు సరియైన సమయంలో కోత కోయవలెను.
👉అలాగే వరి పొలాల్లో అపరాలు వేస్తున్న రైతులు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉మరియు జీడి, మామిడి,జామ మరియు ఇతర పండ్ల తోటలులో రైతులు ఇప్పటినుంచే సస్య రక్షణ చర్యలు చేపట్టి ఘనజీవామృతం,పంచగవ్యను ఉపయోగించవలెను ఇలా చేయటం వలన మొక్కకు సూక్ష్మ ,స్థూల పోషకాలు అంది పూత మరియు పింధే శాతం పెరుగును.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.