వేముల,వేల్పుల గ్రామాలలో పత్తి పంట లో పచ్చదోమ,తెల్లదొమ ఉధృతి ఎక్కువ వుంది ,కావున రైతులు జిగురు పల్లాలు ఎకరాకు 25 చొప్పున పెట్టుకోవాలి,మరియు దోమ నివారణకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 10 నుండి 12 పెట్టుకోవాలి.
అలాగే వేల్పుల.వేముల గ్రామాలలో చీనీ పంటలో ఆకు ముడత ఎక్కువగా వుంది.నివారణకు వేప నూనె 35-40ml tank కలిపి పిచికారి చేయాలి.అరటి లో చిగాట కు తేగులు ఎక్కువగా వున్నది దీని నివారణకు ఒక ఎకరాకు 2 కేజీలు. టీ వీ రీ డి నీ రెండు వందల లీటర్ల. నీటిలో కలి పి పిచికారి లేదా పారించా లి భూమయ్య గారి పల్లి. వేముల మబ్బు చింతల పల్లి గ్రామాలలో
టొమాటో లో బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు నివారణకు శొంఠి పాల కషాయం నీ పిచికారి చేయాలి.
పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే ప్రతి 15 రోజుల కు ఒకసారి జీవామృతం ను పారించి,ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలోని రాజీలేని సూత్రాలను పాటించినట్లైతే పత్తి పంటలో రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. అలాగే జామ తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా వుంది కాబట్టి దీని నివారణకు పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పండు ఈగ బుట్టలు, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), మన వేముల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 9347723277 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు వుంటే క్రింది నంబర్ కు ఫోన్ చేయగలరు
8500983300.
ధన్యవాదాలు.
About the author