Farm advisory
Date-2/10/2022
Centre for Sustainable Agriculture (CSA)
Kisan Mitra centre -Farm Advisory
Proddatur మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 18mm. గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమాపురము క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,రేగుల్లపల్లి కల్లూరు,తల్లమాపురం సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో
ఇప్పుడు అధిక వర్షాల కు
👉వరిలో, పత్తి లో వేరుసనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఎరువులు వేయడం ఆపుకోవాలి. వర్షాలు తగ్గిన తరువాత మురుగు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన తరువాత, నీటి ముంపునకు గురి అయిన వరిలో పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు నివారణకు పేడమూత్రం ఇంగువ ద్రావణం స్ప్రే చేయాలి
*పొలంలోకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
- అలాగే పచ్చ, తెల్ల దోమ ల నివారణకు, తెలుపు, పసుపు ప్లేట్లు అమార్చుకొని , దోమ ఉధృతిని బట్టి నీమాస్త్రం పిచికారీ చెయ్యాలి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయాలి,
👉 వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ
వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణపైన తగిన జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా అలాగే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చును.
👉పశువులను పాకలలో పెట్టాలి, అధిక గాలి వానకు తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
👉వీలైనంతగా పాకలను శుభ్రoగా మరియు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి.
నీరు నిల్వ ఉండడటం వలన దోమలు మరియు ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి,
👉కాబట్టి వీటి నిర్మూలనకు చర్యలను చేపట్టాలి.
అన్ని పశువులకు వ్యాధి నిరోధక టీకాలు మరియు పరాన్న జీవుల నిర్ములకార్యక్రమాలను చేపట్టాలి.
👉పచ్చిగడ్డిని కొంతమేరకు తగ్గించి ఎండుమేతను, దాణాగా వాడాలి.
మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం.
About the author