వేముల మండలం లో రాగల మరో 4 రోజుల యొక్క వాతావరణ సూచన – సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.వర్షపాతం 18 MM ఉండును.,కనిష్ట ఉష్ణోగ్రత :23డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్టఉష్ణోగ్రత: 31 డిగ్రీల సెంటిగ్రేడ్ సరాసరి గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశగా గాలులు వీయును..గాలిలో తేమశాతం 82%-94% ఉంటుంది,
వేముల,వేల్పుల గ్రామాలలో పత్తి పంట లో పచ్చదోమ,తెల్లదొమ ఉధృతి ఎక్కువ వుంది ,కావున రైతులు జిగురు పల్లాలు ఎకరాకు 25 చొప్పున పెట్టుకోవాలి,మరియు దోమ నివారణకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి.
పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే ప్రతి 15 రోజుల కు ఒకసారి జీవామృతం ను పారించి,ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలోని రాజీలేని సూత్రాలను పాటించినట్లైతే పత్తి పంటలో రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. అలాగే భోనుయగారిపల్లి.
వేముల ,వేల్పుల కొన్ని గ్రామాలలో అరటి పంటలో చికటోగ సమస్య ఎక్కువగా ఉంది. కావున రైతులు 1 ఎకరాకు 2 కేజీల ట్రైకోడర్మ వీరిడి ని 200 lit నీటిలో కలిపి పారించాలి లేదా పిచికారి చేయాలి.అలాగే జామ తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా వుంది దీని నివారణకు పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి.భుమయ్యగరిపల్లి వేల్పుల.వేముల.మొబ్బుచింతలపల్లి గ్రామాలలో ట మోటా పంటలో పచ్చ దోమ తెళ్లదోమ వుధృతి ఎక్కువగా వున్నది .. టొమాటో లో వూదు నిర్మూలనకు పండు ఈగ బుట్టలు అమర్చాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పండు ఈగ బుట్టలు, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), మన వేముల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 9347723277 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వ వులన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.
About the author