వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 18mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 82-94 %, అలాగే గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో దోమ నివారణ కొరకై వావిలాకు కషాయం ని పిచికారీ చేయవలెను. అలాగే ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ నిమ్మ లో ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
భూమి రికార్డులు
పంట రుణాలు
కౌలు రైతుల సమస్యలు
విత్తన సమస్యలు
మార్కెట్ యార్డులు, ధరలు
వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు ఫోన్ చేయండి.
About the author