Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 18-30mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-11km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. బోద్ధం,R S పేట, జగ్గయ్యపేట ,కరకవలస గ్రామాల్లో ఆకు ముడత పురుగు ఉదృతి ఉన్నందున కంప లాగి లార్వ దశలలో పురుగులను అధుపు చేయుటకు పచ్చిమిర్చి+వెల్లుల్లి కషాయం పిచికారి చేసుకోగలరు.మరియు పొడ తెగులు నివారణకు రైతులు 1లీ.ఆవు మూత్రం+1లీ. మజ్జిగ తీసుకొని 8లీ. నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవలెను. మరియు పేరటి తోటలలో పెంచుకుంటున్న అరటి మొక్కలకు వర్షాల కారణంగా సిగటోక తెగులు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున రైతులు Trichoderma viridae లేధా సొంటిపాల కషాయం పిచికారి చేసుకోవలెను.అలాగే కెజి పూడి, Sksr పురం క్లస్టర్లులో ఉద్యానవన పంటలు అయిన జీడి మామిడిలో కొత్త చిగుర్లు వచ్చి పూత అధికంగా వస్తు దిగుబడి పెంపొందించుటకు కొమ్మ కత్తిరింపులు చేసుకోవలెను.మరియు YSR రైతు భరోసా పోర్టల్లో కొత్త రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంబించ బడినది కావున వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబందించి 2022-23 సం. గాను అర్హత ఉన్న రైతులందరూ మీ సమీప RBK లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవలెను.గత సం.లబ్దిపొందిన రైతులకు కొత్తగా నమోదు అవసరం లేదు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author