Centre for Sustainable Agriculture
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-15mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 5-6km వేగంతో నైరుతి దిశగా వీయ్యవచ్చు. కేజీ పూడి, SKSR Puram క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంట అయిన వరిలో పోషక లోపం నివారణ,మరియు పంట యేపుగా పెరుగుదలకు,రసం పీల్చు పురుగుల నివారణకు జిల్లెడు ద్రావణం పిచికారి చేసుకోవలెను. అలాగే జగ్గయ్యపేట, సోంపురం, పాతూరు,PKR పురం, రామస్వామిపేట గ్రామాల్లో కత్తెర పురుగు నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోని నివారించవచ్చును. అలాగే ఆకు ఏఁడు తెగులు,అగ్గి తెగులు నివారణకు 3కిలోల పసువుల పెడ 10లీ నీటికి కలిపి పిచికారి చేసుకోని నివారించవచ్చును. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.