Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 12-29mm మొతాదులో తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో దక్షిణం నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రధాన పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు కొనలను తుంచి నాటవలెను ఇలా చేయడము వలన కాండం తొలుచు పురుగు గుడ్లను నాశనం చేయవచ్చును. మరియు ఉద్యానవన పంటలు అయిన జీడి, మామిడి మరియు ఇతర తోటలలో అడ్డదిడ్డముగా ఎదిగిన కొమ్మలను తీసివేయుట వలన సూర్యరష్మీ చెట్టంతా సోకి మంచి కాపునిస్తుంది అలాగే కొత్త చిగురు రావడానికి ద్రవజీవామృతం పారించవలెను. మరియు నేలలో పదును చూసుకొని వరుసల మద్య దున్నటం వలన కలుపు నివారణ జరిగి, భూమిలో కీటకాల గుడ్లు,నిధ్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి ఎండవేడికి నశిస్థాయి.మరియు వర్షపు నీరు బాగా ఇంకుతుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author