టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పాలపల్లి ,టీవీ పల్లె ,బక్కనగారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే పత్తి మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం ,వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు దుక్కిలో200 నుండి 400కేజీల ఘనజీవమృతం తయారు చేసుకొని వేసుకోవాలి.ఘన జీవామృతం వేసుకోవడం వలన భూమిలో సూక్ష్మ జీవుల అభివృధి చెందుతాయి.మరియు విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. వేంపల్లి,జిగురు పల్లాలు, కాషాయ లు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
About the author