Date: 30-7-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 12-29mm మొతాదులో తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో దక్షిణం నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రధాన పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు కొనలను తుంచి నాటవలెను ఇలా చేయడము వలన కాండం తొలుచు పురుగు గుడ్లను నాశనం చేయవచ్చును. మరియు ఉద్యానవన పంటలు అయిన జీడి, మామిడి మరియు ఇతర తోటలలో అడ్డదిడ్డముగా ఎదిగిన కొమ్మలను తీసివేయుట వలన సూర్యరష్మీ చెట్టంతా సోకి మంచి కాపునిస్తుంది అలాగే కొత్త చిగురు రావడానికి ద్రవజీవామృతం పారించవలెను. మరియు నేలలో పదును చూసుకొని వరుసల మద్య దున్నటం వలన కలుపు నివారణ జరిగి, భూమిలో కీటకాల గుడ్లు,నిధ్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి ఎండవేడికి నశిస్థాయి.మరియు వర్షపు నీరు బాగా ఇంకుతుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 19 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 40 %, అలాగే గంటకి 10 కి.మి. వేగంతో దక్షిణ దిశా గ గాలులు వీయవచ్చును . టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీని వలన పెరుగుదల తగ్గి ఆకులపై హోపర్ బర్న్ లక్షణం కనిపిస్తుంది. దీనిని నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పంటలో 2 లేదా 3 కాయలను కోసి గమనిస్తూ ఉండాలి. అలాగే పత్తి లో మెగ్నీషియం లోపం వలన ఆకులు ఎర్రగా మారిపోవడం. అలానే ఈ పత్తి ఆకులు అధికముగా వీచు గాలుల వలన గాని, చల్లటి వాతావరణం వలన గాని ఈ ఆకులు ఎర్రగా అవును. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది వర్షధారంగా వేసుకొనే పత్తి రైతులు మంచి విత్తన రకాన్ని ఎన్నుకొని బీజామృతం తో గాని లేదా టి విరిడి తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి.కాబట్టి భవిష్యత్తు లో మన పంట కి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా పంట చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే పసుపు జిగురు పల్లాలు, కషాయాలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం.. మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు. అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.?? 👉 భూమి రికార్డులు 👉పంట రుణాలు 👉 కౌలు రైతుల సమస్యలు 👉 విత్తన సమస్యలు 👉 మార్కెట్ యార్డులు, ధరలు 👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు 👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం తదితర సమస్యల పరిష్కారం కొరకు CSA కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.
Date: 27-7-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 2-44mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-10km వేగంతో దక్షిణం నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి నారును ప్రధాన పొలంలో నాటుతున్న రైతులు నాటడానికి ముందు పెడ+మూత్రం+ఇంగువ ద్రావనంలో ముంచి నాటుకోవలెను ఇలా చెయ్యడం వలన పురుగులు , తెగుల్ల సమస్యను నివారించవచ్చును. మరియు నాట్లు వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20సెం.మీ దూరములో కాలిబాటలు తీయవలెను. కాలిబాటలు తీయటం వలన పైరుకు గాలి,వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉదృతిని కొంత వరకు అధుపుచేయవచ్చు. మరియు ప్రస్తుత వాతావరణ పరిస్తితులకు వేరుశనగ పంటలో మొదలుకుళ్లు తెగులు ఆశించు అవకాశం కలదు కావున ధబ్బిరాజుపేట, కోటయ్యగరువు, సారవానిపాలెం, దుంగాడ గ్రామాల్లో వేరుశెనగ వేసుకున్న రైతులు తెగులు ఆశించిన మొక్కలను తీసివేసి,5% ఆవుమూత్ర ద్రావణాన్ని పిచికారీ చేయవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజుల్లో 11mm వర్షపాతం రాగలదని సూచన. అలాగే గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలులు వీయవచ్చును . టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె, బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉండటం వలన ఆకుముడత వస్తుంది.అలాగే పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పురుగు ల ఉదృతినీ గమనిస్తూ వుండాలి. అలాగే పత్తి లో మెగ్నీషియం మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి. దీని చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా బంతి,ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి . రైతుల ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
Date: 23-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు ఆకాశం మేఘవృతమై ఉండి 18-32mm మోతధులో మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-25డిగ్రీలు గా ఉండే అవకాశం కలదు. గాలి గంటకి 7-12km వేగంతో నైరుతి నుండీ పడమర వైపు వీచే అవకాశం ఉంది. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి వలన వరిలో తెగుల్లు ఆశించే అవకాశం ఉంది కావున రైతులందరు పెడ+మూత్రం+ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవలెను. అలాగే Pkr puram,saravanipalem,chamalapalli గ్రామలలో కూరగాయాలు వేసుకున్న రైతులు రసం పీల్చే పురుగులు ఆశించకుండా వేప కషాయం లేధా పంచపత్ర కషాయం పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
Date: 20-7-2022 Centre for Sustainable Agriculture-Vepada Farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-11km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి నారును వేసుకున్న రైతులు నాారు మడులలో ద్రవజీవామృతం పారించవలెను. దీనివలన మొక్కకు కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతోంది. అలాగే నారు వ్యవస్థలో రసం పిల్చె పురుగులు ఆశించకుండా నీమాస్త్రం పిచికారి చేసుకోవలెను. మరియు ధబ్బిరాజుపేట, కోటయ్యగరువు, శరవానిపాలెం, దుంగాడ గ్రామాల్లో వేరుశెనగ వేసుకున్న రైతులు తిక్క ఆకు మచ్చ తెగులు రాకుండా పెడ+ముత్రం+ఇంగువ ద్రావణం పిచ్చికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
Date: 16-7-2022 Centre for Sustainable Agriculture-Vepada Farm Advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-24mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్ లో నారు మడులలో వరి విత్తనాలు వేస్తున్న రైతులు బీజామృతం తో విత్తన శుద్ధి చేసుకోవలెను. మరియు ప్రధాన పొలం గట్లపై సరిహద్దు పంటలుగా కంది,జొన్న,మొక్కజొన్న,సజ్జ,కురగాయలను,తీగ జాతి మొక్కలను వేసుకోవలెను. అలాగే ఎర పంటలుగా బంతి,చామంతి, ఆముదం మొ|| వాటినీ వేసుకోవాలి. ఇలా గట్లపై మొక్కలను పెంచడం వలన ప్రధాన పంటకు బయట పొలాల నుండి శత్రు పురుగులు ఆశించకుండా ఉంటాయి అలాగే మిత్ర పురుగులు అభివృద్ధి చెంది శత్రు కీటకాలను అదుపులో ఉంచుతాయి. మరియు రైతుకు అదనపు ఆధాయం కూడా లభిస్తుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -37డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజుల్లో మబ్బులతో మేఘవృతం అయ్యి ఉండును. గాలిలో తేమ 40 %, అలాగే గంటకి 29 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలులు వీయవచ్చును . టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె, బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది. అలాగే ఆకుముడత ఆకు మీద సర్పిలాకారంలో వలయాలుగా చేరి రసాన్ని పీల్చును. అలాగే పచ్చ దోమ వలన ఆకు చివర్లు ఎర్రగా మారి ఎండి పాలిపోవును. దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టి ఎప్పటికప్పుడు పంటలో 2 లేదా 3 కాయలను కోసి గమనిస్తూ ఉండాలి. అలాగే పత్తి లో magnesium మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు వచ్చే సమయం లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి. దీని చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా బంతి,ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
Date: 13-7-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-47mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 31-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-9km వేగంతో పడమర నుండీ నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్ లో నారు మడులలో వరి విత్తనాలు వేస్తున్న రైతులు బీజామృతం తో కానీ, ట్రైకోడెర్మాతో కానీ, సూడోమోనాస్ తో కానీ విత్తనశుద్ధి చేసుకోవలెను. విత్తనశుద్ధి చేసుకోవటం వలన విత్తనం బాగా మొలకెత్తి, విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియంత్రిస్తుంది. అలాగే PKR పురం, ఎస్కేఎస్ఆర్ పురం, సారవానిపాలెం గ్రామాల్లో కురగాయాలు వేసుకున్న రైతులు రసం పీల్చే పురుగుల ఉద్రుతి నుండి రక్షించుకోనుటకు వేపనూనె లేదు నీమాస్త్రం పిచ్చికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – వర్షము 8mm కురిసే అవకాశం వుంది. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు . తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట కు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా గత వారం లో చెపుకున్న విషయాలు మళ్ళీ ఒక సారి గుర్తు కు చేసుకున్నాము,విత్తనసుద్ది, ఘనజీవమృతం, ద్రావజీవమృతం ఇప్పుడు ఈ వారంలో రైతులు మంచి విత్తనం యంపీక చేసుకోవాలి,, నారు పెట్టడానికి , అనువైన పొలాన్ని నారు మడి కోసం యంపీక చేసుకోవాలి, నారుమడిలో మెళకువలు తెలీసుకున్నాము: బెంగాల్ పద్ధతి నాట్లు, సంప్రదాయం నాట్లు, బెంగాల్ వాళ్ళు నాట్లకు 2 సెంట్స్ నారు మడ్డి అయితే సరిపోతుంది, ఎకరాకు, అదేవిధంగా సంప్రదాయం నాట్లు అయితే 4 నుంచి 5 సెంట్స్ లో నారు మడి సరిపోతుంది ఎకరాకు, *నారు మడి ని వారం రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి ,బాగా చివికిన పశువుల ఎరువును 200 కిలోల 5 సెంట్స్ నారు మడికి వేయాలి, *చివరి దమ్ము లో తయారు చేసుకున్న ఘనజీవమృతం, వేసుకోవాలి, ట్రైకోడర్మ 1kg నారు మడి కి వేసుకోవాలి, మొలక కట్టిన విత్తనాన్ని బీజామృతం తో విత్తనసుద్ది చేయాలి, సెంటు నారు మడికి 4 to 5 కిలో చొప్పున నారు మడిలో పలుచగా నీరు పెట్టి చలలి, మరుసటి రోజు మడి నుంచి నీటిని పూర్తిగా తీసివేయాలి, ఆకులు బయటకు వచ్చే వరకు ఆరుతడి పెట్టాలి, విత్తనం చలిన 7 to8 రోజుల కు 5 సెంట్స్ నారు మాడి కి 10:1 లో ద్రావజీవమృతం పారించాలి, అంటే 100 లీటర్ కు ఒక లీటర్ చొప్పున పారించాలి, ఇలా చేవడం వల్ల నారు బాగా ఉండి ,పిలకలు ఎక్కువ వచ్చి ,దిగుబడి అధికంగా ఉంటుంది. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.